అన్ స్టాపబుల్2 షోలో చంద్రబాబు నాయుడు బాలయ్య ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో పెట్టాలని బిల్ గేట్స్ ను కోరానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
బసవతారకం గారు బాధపడిన విధానం చూసి సీనియర్ ఎన్టీఆర్ గారు క్యాన్సర్ ఆస్పత్రి పెట్టారని చంద్రబాబు అన్నారు.ఆ పుణ్య దంపతులు ఎక్కడ ఉన్నా ఆత్మ శాంతించే విధంగా మనం పని చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
ఆ తర్వాత కార్డ్స్ ఆడుకుందామా బావా అంటూ బాలయ్య సరదాగా కామెంట్ చేశారు.
మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటని బాలయ్య అడగగా మీకంటే ఎక్కువే చేశానని మీరు సినిమాలలో చేస్తే నేను స్టూడెంట్ గా చేశానని చంద్రబాబు అన్నారు.
యూనివర్సిటీ క్యాంపస్ లో మోటార్ బైక్ వేసుకుని సైకిల్ స్టాండ్ దగ్గర ఉండేవాడినని చంద్రబాబు కామెంట్లు చేశారు.అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్ తీసి సౌండ్ పెంచానని చంద్రబాబు అన్నారు.
అమెరికాకు వెళ్లిన సమయంలో ఒక అమ్మాయి అప్పుడు చంద్రబాబేనా అని అడిగారని మీరు అప్పుడు అల్లరి పనులు చేసేవారని అన్నారని చంద్రబాబు తెలిపారు.లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ రాజకీయాల్లోకి వచ్చాక వైఎస్సార్ నేను కలిసి బాగా తిరిగామని అన్నారు.నేను తెలుగుదేశంకు వచ్చిన తర్వాత నేను రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ గా శత్రువులు అయ్యామని చంద్రబాబు అన్నారు.
లేజీనెస్ అంటే నాకు చాలా కోపమని చంద్రబాబు వెల్లడించారు.బాలయ్య మనసులో చాలా సీక్రెట్స్ ఉన్నాయని చంద్రబాబు అన్నారు.మా యూత్ గురించి ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయం ఏంటనే ప్రశ్నకు మీ యూత్ అంటే ఏంటని చంద్రబాబు రివర్స్ లో అడిగారు.
నువ్వు కూడా సీనియర్ సిటిజన్ కదా అంటూ చంద్రబాబు బాలయ్య పరువు తీశారు.మీరు యాక్ట్ చేయడానికి రంగు వేసుకుంటారని అలా ఏజ్ ను కవర్ చేస్తారని చంద్రబాబు అన్నారు.
ఆలోచనా విధానంలో అందరి కంటే నేనే యంగెస్ట్ మ్యాన్ అని చంద్రబాబు కామెంట్లు చేశారు.