విశాఖ విజయసాయిరెడ్డి రాజధాని అని ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజు విజయసాయి రెడ్డే, ధనం విజయసాయి రెడ్డిదేనని విమర్శించారు.
విశాఖ రాజధానంటూ ఉత్తరాంధ్రులను మాయ చేస్తున్నారని ఆరోపించారు.మూడున్నర సంవత్సరాలుగా ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ఏమీ చేయని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.వైసీపీది అభివృద్ధి వికేంద్రీకరణ కాదన్న ఆయన అవినీతి వికేంద్రీకరణ అంటూ ఎద్దేవా చేశారు.
జగన్ అవినీతిని విశాఖ వరకు తెచ్చేందుకే మూడు రాజధానులని ధ్వజమెత్తారు.జగన్ కు కావాల్సింది ప్రాంతాలు, ప్రజల మధ్య కొట్లాట అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.