ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎన్టీఆర్ సర్కిల్ లోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కృష్ణా నదీ జలాల మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం నిమిత్తం టీడీపీ నిర్మించిన శిలాఫలకాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు.
దీంతో శిలాఫలకాన్ని అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కౌన్సిలర్లు, టీడీపీ అభిమానులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వ్రాత పూర్వకంగా తొలగిస్తున్నామని పత్రం ఇస్తే వెళ్లిపోతామని టీడీపీ శ్రేణులు చెప్పారు.
దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులకు సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.







