కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానన్నారు.
పార్టీ పదవిని మాత్రమే ఆశించినట్లు తెలిపారు.అంతేకానీ ముఖ్యమంత్రి, మంత్రి పదవులు తనకు అవసరం లేదని స్పష్టం చేశారు.
అనంతరం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలోని సంపదంతా కేసీఆర్ కుటుంబానికే సరిపోవడం లేదని విమర్శించారు.
మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల పాలు చేశారని ఆయన ఆరోపించారు.రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.







