తమిళనాడు పాలిటిక్స్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు ఎంజీఆర్ బంధువులు షాక్ ఇచ్చారు.
ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టనుంది.దీంతో, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను రామాపురం తోటలోని పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎంజీఆర్ నివాసం ఆవరణలో నిర్వహించాలని శశికళ శిబిరం నిర్ణయించింది.
ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.అయితే, హఠాత్తుగా ఎంజీఆర్ బంధువులు చిన్నమ్మకు షాక్ ఇచ్చారు.
రామాపురం తోటలో ఎలాంటి వేడుకలు నిర్వహించ వద్దని, తాము అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు.దీంతో మరో వేదికను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి చిన్నమ్మ మద్దతు దారులకు ఏర్పడింది.







