ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నర్సింహరావుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్లు చేస్తున్నారు.ఆయన ప్రవచనాలను ఉద్దేశించి ఆర్జీవీ వరుసగా ట్వీట్లు చేస్తూ విమర్శిస్తున్నారు.
అత్యాచారాలకు మహిళలే బాధ్యులన్న గడ్డిపాటి అంటూ ట్వీట్ షేర్ చేశారు.అనంతరం ఆత్మగౌరవం ఉన్న మహిళలు అందరూ ఈ వ్యక్తిపై దాడి చేయాలన్న ఆర్జీవీ.
మహిళల డ్రెస్సింగ్ పై ఇలా మరో వ్యక్తి మాట్లాడటం చూడలేదన్నారు.అంతేకాకుండా హిందూయిజంపై గరికపాటి వ్యాఖ్యలపై కూడా ఆర్జీవీ ట్వీట్స్ చేశారు.
అయితే, ఇటీవల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ -బలయ్ కార్యక్రమంలో చిరంజీవిపై గరికపాటి కాస్త అసహనం వ్యక్తం చేశారు.అప్పటి నుంచి గరికపాటిపై ఆర్జీవీ పరోక్షంగా, ప్రత్యక్షంగా ట్విట్టర్ వేదికగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.







