ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఆయిల్ కంపెనీల నష్టాల భర్తీకి రూ.22 వేల కోట్ల ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.అదేవిధంగా రైల్వే ఉద్యోగులకు కేంద్రం దీపావళి బోనస్ ప్రకటించింది.దీనిలో భాగంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ రూ.1,823 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.నార్త్, ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధికి సైతం రూ.6,600 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.







