ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రాజకీయ నాయకులకు సొంతంగా మీడియా ఛానళ్లు ఉన్నాయి.తమ పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు, తమ తరపున ప్రచారం చేసుకునేందుకు, ఎన్నికల సమయంలో తమ గురించి , తమ పార్టీ గురించి వీలైనంత ఎక్కువ ప్రచారం చేసుకునేందుకు సొంతంగా మీడియా ఛానెళ్ల ను, పత్రికలను ఏర్పాటు చేసుకోవడం ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో మొదలైంది.
ఇక కొన్ని పార్టీలకు అనుకూలంగా కొన్ని మీడియా ఛానెళ్లు, పత్రికలు వ్యవహరిస్తూ తమ స్వామి భక్తుని ప్రదర్శించుకుంటూ వస్తున్నాయి.దీనిపై అనేక విమర్శలు వస్తున్న ఇదంతా సర్వసాధారణమైన వ్యవహారంగానే మారిపోయింది.
ఇదిలా ఉంటే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి తాను కొత్తగా మీడియా ఛానెల్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఓ మీడియా అధినేతకు సవాల్ విసురుతూ మీకు పేపరు చానల్ ఉందనే కదా టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ, తమపై పెద్ద ఎత్తున అసత్య కథనాలను ప్రచారం చేస్తూ, తమ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు.
అందుకే తాను తన సొంత సొమ్ములతో మీడియా ఛానల్ ను పెట్టబోతున్నానని ఇక కాచుకోండి అంటూ సవాల్ విసిరారు.ముఖ్యంగా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ను టార్గెట్ చేసుకుని విజయ సాయి రెడ్డి విమర్శలు చేశారు.పచ్చళ్ళు అమ్ముకునే రామోజీకి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.2500 ఎకరాలను ఫిలిం సిటీ పేరుతో కబ్జా చేశారంటూ విమర్శించారు.అలాగే మార్గదర్శి కేసుల పైన విచారణకు సిద్ధమేనా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.కొన్ని మీడియా ఛానెళ్లు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, కొన్ని పత్రికలు, ఛానెళ్లు టిడిపి కరపత్రాలుగా మారిపోయాయని విజయసాయి రెడ్డి విమర్శించారు.

రామోజీకి నైతిక విలువలు లేవని, ఆస్తులపై ఈడి, సీబీఐ, ఎఫ్ బీ ఐ విచారణకు సిద్దమేనా అంటూ విజయసాయి సవాల్ విసిరారు.ప్రస్తుతం కొత్త ఛానెల్ ప్రారంభించే ఆలోచనలో ఉన్న విజయసాయి దానికి సంబందించిన వ్యవహారాలపై ఒక క్లారిటీకి రావడంతోనే కొత్త ఛానెల్ ఏర్పాటు అంశంపై స్పందించి ప్రకటన చేసినట్టు అర్థం అవుతోంది.అయితే కొత్త ఛానెల్ ను ప్రారంభింస్తారా లేక ఇప్పటికే నడుస్తున్న ఏదైనా ఛానెల్ ను కొనుగోలు చేసి మరిన్ని హంగులు దిద్దుతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.







