ఆ విషయం రష్మికకు ముందే తెలుసా.. అందుకే మాల్దీవులకు వెళ్లిందా?

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్నను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.

 Rashmika Mandanna Know That Mater Not Getting Film Fare Award Details, Rashmika-TeluguStop.com

అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.

ఇప్పుడు ఈమె అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

ప్రెసెంట్ రష్మిక చేసిన గుడ్ బై సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా బాలీవుడ్ లో బోల్తా పడింది.అమితాబ్ బచ్చన్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ అయినా తనకు ఎలాంటి చింత లేకుండా వెకేషన్ కు చెక్కేసింది.

అయితే ఈమె వెకేషన్ కు వెళ్లిన సమయంలోనే ఫిలిం ఫేర్ అవార్డు వేడుక అట్టహాసంగా జరిగింది.ఈ వేడుకలో మెయిన్ పుష్ప సినిమాకు అవార్డుల పంట పండింది అనే చెప్పాలి.

Telugu Filmfare Awards, Pushpa, Rashmika Award, Saipallavi, Srivalli-Movie

అన్ని క్యాటగిరీల్లో అవార్డులు అందుకున్న పుష్ప ఉత్తమ నటి విషయంలో మాత్రం అవార్డు అందుకోలేక పోయింది.రష్మిక పుష్ప సినిమాలో చేసిన శ్రీవల్లి పాత్ర ఎంతగా ఆదరణ పొందిందో చెప్పాల్సిన పని లేదు.దీంతో ఈమెకు కూడా అవార్డు గ్యారెంటీ అని అనుకున్న ఫ్యాన్స్ ఈమె వెకేషన్ కు చెక్కేస్తే ఎవరు అవార్డు తీసుకుంటారో అని బాధ పడ్డారు.కానీ ఉత్తమ నటి గా సాయి పల్లవి అవార్డు అందుకుని అందరికి షాక్ ఇచ్చింది.

Telugu Filmfare Awards, Pushpa, Rashmika Award, Saipallavi, Srivalli-Movie

మరే క్యాటగిరీలో కూడా శ్రీవల్లికి అవార్డు రాకపోవడం గమనార్హం.మరి ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డు రష్మికకు రాలేదని ముందే లీక్ అవ్వడం వల్లనే ఆమె వెకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేసింది అని హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.అయితే ఈమె మాత్రం ఎలాంటి బాధ లేకుండా వెకేషన్ మూడ్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.మరి ఇంత మంచి పాత్ర చేసిన ఫిలిం ఫేర్ అవార్డు అందుకోలేక పోయింది.

అయినా ఏమాత్రం బాధ పడుతున్నట్టు కూడా అనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube