వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సింపుల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ అని పిలుచుకునే ఈ ఆటపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.డబ్ల్యూడబ్ల్యూఈలో రెజ్లర్లు నిజంగానే కొట్టుకుంటారా? వారికి వచ్చే రక్తం నిజమేనా? అని చాలామందికి సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు.అయితే ఇది ఫేక్ అని ఇప్పటికే చాలామంది ప్రూఫ్స్‌తో సహా నిరూపించారు.ఫేక్ అని చెప్పినంత మాత్రాన రెజ్లర్లకు దెబ్బలు తగలవని కావు.కానీ ఈ మ్యాచ్‌లలో ప్రతిదీ ప్లాన్ చేస్తారు.ఎవరు ఎన్ని పంచులు ఇవ్వాలి, ఎవరు ఎక్కువ తన్నాలి, ఎవరు గెలవాలి, ఎవరు మధ్యలో వచ్చి జోక్యం చేసుకోవాలి వంటివన్నీ కూడా ముందుగానే రాసిన స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయి.
అయితే స్క్రిప్ట్ ప్రకారం జరిగినా మ్యాచ్ ఆడేటప్పుడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి.కాకపోతే ఆ దెబ్బల తీవ్రత స్వల్పంగా ఉంటుంది.ఒక్కోసారి చాలా బలహీనంగా కనిపించే రెజ్లర్ బలవంతుడైన మరో రెజ్లర్‌పై గెలుస్తాడు.ఇలాంటి మ్యాచ్‌లు చూసినప్పుడు ఇది ఫేక్ అని ఎవరికైనా తెలుస్తుంది.
అయితే తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ ఎంత ఫేకో తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఒక కుక్క ఒక రెజ్లర్‌పై గెలిచింది.
దీన్ని చూసి అందరూ అవాక్కవుతున్నారు.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే.ఫైటింగ్ రింగులో ఒక రెజ్లర్ ఉండగా మరొకవైపు ఒక కుక్క కనిపించింది.ఈ కుక్క పక్కనే ఒక లేడీ ట్రైనర్ కూడా ఉంది.
ఈ కుక్కకి ఆ రెజ్లర్‌కి మధ్య మ్యాచ్ పెట్టారు.వీరిద్దరి మధ్య ఎవరు గెలుస్తారో నిర్ణయించడానికి ఒక అంపైర్ కూడా ఉన్నాడు.
ఆ తర్వాత ట్రైనర్ తన కుక్కని రెజ్లర్‌పై దాడి చెయ్యమని చెప్పింది.అంతే ఆ కుక్క రెజ్లర్‌పై ఒక్కసారిగా మీద పడి దాడి చేసింది.
ఆపై అతడు వెంటనే కిందపడిపోయాడు.అనంతరం అతనిపై ఆ కుక్క నిల్చుంది.
అప్పుడు రెఫరీ ‘వన్.టూ.త్రీ’ అని కొట్టాడు.ఆ కుక్క విన్ అయింది.
రెజ్లర్ మాత్రం దెబ్బలు బాగా తగిలినట్టు మహానటి లెవల్లో యాక్ట్ చేస్తూ కనిపించాడు.దీన్నిబట్టి ఇదొక ప్యూర్ యాక్టింగ్ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.