స్టార్ హీరోల పక్కన అవకాశాలు.. అసలు ఎలా వచ్చాయో అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నిది అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

 Nidhi Agarwal In Prabhas Raja Deluxe , Nidhi Agarwal , Pawan Kalyan , Prabhas ,-TeluguStop.com

ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే అందం అభినయం అన్నీ ఉన్నా కూడా ఈమెకు అవకాశాలు పెద్దగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.

అంతేకాకుండా ఈమె స్టార్ హీరోల సరసన నటిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ మాత్రం అవ్వలేకపోతోంది.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా నిది అగర్వాల్ సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఆ వార్త విన్న అభిమానులు ఆశ్చర్యపోవడంతో పాటు, ఎలా అంటూ షాక్ అవుతున్నారు.అయితే నిధి అగర్వాల్ చేతిలో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలే ఉన్నాయి.రెండు సినిమాలలో కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్నారు.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈమె షూటింగ్లో కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సమాచారం ప్రకారం మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న సినిమాలో, మాళవిక మోహన్ తో పాటుగా ఈ ముద్దుగుమ్మను కూడా హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Telugu Maruthi, Nidhi Agarwal, Pawan Kalyan, Prabhas-Movie

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేక బాధపడుతున్న నిధి అగర్వాల్ కు ఇలా టాప్ హీరోల సరసన నటించే ఆఫర్స్ ఎలా వచ్చాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.అదేమిటంటే.పెద్ద హీరోల సినిమాలలో నటించడానికి పలువురి హీరోయిన్లు కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండగా నిధి అగర్వాల్ మాత్రం 40 నుంచి 60 లక్షల మాత్రమే చెబుతోందట.

దీంతో ఈమెకు ఈ విధంగానే అవకాశాలు వస్తున్నాయి అనేసిని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి కారణం ఏమైనాప్పటికీ ఈ ముద్దుగుమ్మ పెద్ద స్టార్స్ హీరోల సినిమాలు ఉన్నాయి.

మరి ఈ రెండు సినిమాల తర్వాత అయినా అగర్వాల్ మళ్ళీ ఫామ్ లోకి వస్తుందో లేదో అలాగే ఆమె అనుకున్న విధంగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంటుందో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube