వామ్మో కాజల్ వార్షిక ఆదాయం మామూలుగా లేదు.. భారీగా ఆస్తులు పోగుచేసిన కాజల్?

లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు వెండితెర చందమామ కాజల్ అగర్వాల్.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అనంతరం చందమామ, మగధీర వంటి వరుస హిట్ సినిమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Kajal's Annual Income Is Not Normal Kajal Who Accumulated Huge Assets , Accumul-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ గత దశాబ్దన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న కాజల్ ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నారు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.ఇక బాబు పుట్టిన తర్వాత కాజల్ తిరిగి తన కెరీర్ ను ప్రారంభించారు.ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే కాజల్ ఇన్ని సంవత్సరాల సినీ కెరియర్లో భారీగానే ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.ఇలా ఈమె ఇండస్ట్రీలో ఉంటూ సుమారు100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.

ఒక వెబ్ సైట్ కథనం ప్రకారం ఈమె వార్షిక ఆదాయం కూడా సుమారు ఆరు కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.ఇవే కాకుండా కాజల్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు కూడా ఉన్నట్టు సమాచారం.సుమారు 10 కోట్ల రూపాయల విలువచేసే ఇంటిలో కాజల్ నివసిస్తున్నారు.అలాగే ఈమె గ్యారేజ్ లో ఉన్నటువంటి కార్లు విలువ సుమారు మూడు కోట్లకు పైగా విలువ చేస్తాయని తెలుస్తోంది.

మొత్తానికి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే డబ్బు పోగు చేస్తున్నారు.ఇదే కాకుండా కాజల్ ఇప్పటికే పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టిన విషయం మనకు తెలిసిందే.

ఇక తన భర్త గౌతమ్ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube