నాగార్జునసాగర్ ప్రధాన కాల్వకు గండి పడింది.ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి.
పెనుబల్లి మండలం తుమ్మలపల్లి – బయన్నగూడెం మధ్య కాల్వకు గండి ఏర్పడింది.దీంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి.
పంటలన్నీ నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం స్పందించిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు.