అలియా భట్… ఆ మధ్యకాలంలో ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అంటే తప్పుగా ఎవరో పేరు చెప్పి సోషల్ మీడియా చేతిలో అడ్డంగా బుక్కై కొంచెం బుర్ర తక్కువ అనే ఫీలింగ్ తెప్పించుకున్న హీరోయిన్.జనరల్ నాలెడ్జ్ లేకపోయినా బాడీ లాంగ్వేజ్ తో బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటూ కరణ్ జోహార్ వంటి పెద్దల ఆశీస్సులతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలియా ఈ మధ్య కాలంలో రణభీర్ కపూర్ ని వివాహం చేసుకుంది.పెళ్లి జరిగి కొన్ని రోజులు కాకుండానే తాను గర్భవతిని కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా విపరీతంగా బయటపెట్టి ట్రోలింగ్ కి గురైంది.
అప్పుడే పెళ్లి చేసుకుని ఇప్పుడే బిడ్డను అంటున్నారు ఏంటి అని అనేవారు కొందరైతే వాళ్ల జీవితం వాళ్ళ ఇష్టం అంటూ అనుకునేవారు మరికొంతమంది.ఏది ఏమైనా ఆ సెలబ్రిటీస్ ఏ పని చేసినా ట్రోల్ అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది.
అయితే ఆలియా భట్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో అద్దె గర్భంతో పిల్లలు కనే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.ఇక నయనతార కూడా సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
ఇక శిల్ప శెట్టి సైతం మొదట ఒక బిడ్డకు జన్మ ఇచ్చాక రెండో బిడ్డ కోసం సరోగసీ పై ఆధారపడింది.

కానీ వీరందరికీ భిన్నంగా ఆలియా భట్ పెళ్లైన అతి తక్కువ సమయంలోనే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటకు చెప్పింది.అంతటి తో ఆగకుండా తన సినిమా ప్రమోషన్స్ అంతా కూడా కడుపుతో ఉంటూనే చేసింది.భర్తతో దేశమంతా తిరిగింది.
మాతృత్వపు యొక్క ప్రతి దశను ఎంజాయ్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతోంది.చాలా సార్లు ఆలియా భట్ కి బుర్ర లేదు అని చెప్పినవారు ఆమెకి ఉన్న ఓపికకి వ్యక్తిత్వానికి ప్రస్తుతం ఫిదా అవుతున్నారు.

పైగా ఆమె ఏం చెప్పినా కాదనే వారు లేరు ఆమెకి వందల కోట్ల ఆస్తి ఉంది.అత్త నీతూ గాని, భర్త రణభీర్ గాని ఎవరు ఆమెకు ఏ విషయంలోనూ నో చెప్పరు.అయినా కూడా ఆమె స్వయంగా తానే తొమ్మిది నెలల పాటు బిడ్డను కానీ పెంచాలనుకుంది.హీరోయిన్ గా ఉచ్చ స్థానంలో ఉన్నా కూడా కెరియర్ పోతుంది అనే భయం లేకుండా తల్లిగా మారబోతున్న ఆలియా ని చూస్తే ముచ్చట వేయకుండా ఉంటుందా చెప్పండి.







