ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల రగడ రాజకీయ వేడిని రాజస్తోంది.చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీల నాయకులు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు కూడా తెలపడం జరిగింది.మరోపక్క వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని మూడు రాజధానులు పెట్టడానికి రెడీ అవుతోంది.
అమరావతితో పాటు కర్నూలు ఇంకా విశాఖపట్నంలో కూడా రాజధాని పెట్టేలా ప్రయత్నాలు చేస్తూ ఉంది.
ఈ క్రమంలో అమరావతియే రాజధానిగా ఉంచాలని … టీడీపీ మరియు జనసేన నేతలు కామెంట్లు చేస్తూ ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారు.
మరోపక్క విశాఖ గర్జన పేరిట ఈనెల 15వ తారీకు భారీ ర్యాలీ నిర్వహించడానికి కూడా రెడీ అయింది.ఇటువంటి తరుణంలో వైసీపీ ఆధ్వర్యంలో జరగబోయే విశాఖ గర్జన పై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా విమర్శలు చేయటం జరిగింది.
దీంతో వైసీపీ మంత్రులు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
తాజాగా మంత్రి జోగి రమేష్.పవన్ చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.“కళ్ళు ఉన్న చూడలేని కబోది పవన్.నోరన్న మాట్లాడలేని మూగ సన్నాసి.చంద్రబాబు చెంచా.
ఆయన ఏది చెబితే పవన్ అదే చేస్తారు.ట్విట్లు కాదు పవన్ చర్చకు రావాలి.
ప్రతి విషయంపై నేను మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా.హైదరాబాదులో ఉండే పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ వైసీపీ మంత్రి జోగి రమేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.