100 కోట్ల క్లబ్ లో గాడ్ ఫాదర్.. పోస్టర్ తో మేకర్స్ క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్.గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయ్యి మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

 Megastar Chiranjeevi's Godfather Enters Rs 100-crore Club, 100-crore Club, Satya-TeluguStop.com

ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని చిరుతో పాటు మెగా ఫ్యాన్స్ కు ఆతృతగా ఎదురు చూసారు.కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగిపోతుంది.

ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు.లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

పండుగ వేళ రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్ పండుగ సినిమా అనిపించుకుంది.

మెగా ఫ్యాన్స్ ను చాలా రోజుల తర్వాత ఆకట్టుకున్న సినిమా ఇది కావడంతో మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

అలాగే కలెక్షన్స్ లో కూడా దూసుకు పోతుంది.తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

మోహన్ రాజా ఈ సినిమాలోని అన్ని పాత్రలను పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడంలో సఫలం అయ్యాడు.ఇక ఈ సినిమా తాజాగా ఒక మైలురాయిని అధిగమించింది అని తెలుస్తుంది.

తాజాగా గాడ్ ఫాదర్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది.ఈ విషయాన్ని మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు.దీంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ కలెక్షన్స్ ఎక్కడ వరకు సాధించి ఆగుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube