ఇండియాలో కబడ్డీ ఆటకు మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రో కబడ్డీ పుణ్యమా అని సామాన్య ప్రజలకు కూడా ఈ ఆట ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
చిన్న పిల్లలు, యుక్తవయస్కులతో పాటు అమ్మాయిలు, మహిళలు కూడా ఈ ఆట ఆడుతున్నారు.అయితే తాజాగా చీరలు కట్టుకున్న అమ్మలు కబడ్డీ ఆట ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
వారి ఆటకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ వీడియోకి ఇంటర్నెట్‌లో 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వైరల్ వీడియోలో చీర ధరించిన మహిళలు ఒక గ్రామంలో కబడ్డీ ఆడుతున్నట్లు చూడవచ్చు.
ఈ మహిళలు ఉత్సాహంతో ఒకరినొకరు సవాలు చేసుకుంటూ కబడ్డీ ఆట ఆడారు.చీర కట్టుకున్న వీరు ప్రొఫెషనల్ ప్లేయర్ల వలె వేగంగా గేమ్ ఆడుతూ అందరినీ అబ్బుర పరిచారు.
అక్టోబర్ 6, 2022న గురువారం నాడు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేంద్ర బాఘెల్ ప్రారంభించిన చత్తీస్‌గఢ్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈ కబడ్డీ మ్యాచ్ జరిగింది.ఈ క్రీడా ఈవెంట్ అక్టోబర్ 6 నుంచి జనవరి 6, 2023 వరకు జరుగుతుందని సమాచారం.

ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళలను, ఈ మ్యాచ్ నిర్వహించిన వారిని పొగుడుతున్నారు.ఈ ఆట ఆడటం వల్ల మహిళలలో బలం పెరుగుతుందని ఇంకొందరు అంటున్నారు.ఈ వయసులో కూడా రెట్టింపు ఉత్సాహంతో ఆట ఆడిన ఈ అమ్మ లకు హ్యాట్సాఫ్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







