నయనతార ప్రెగ్నెంట్ ఎప్పుడైంది? సరోగసినా? దత్తత తీసుకుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ బ్యూటిగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి నయనతార. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.

 Nayanthara And Vignesh Shivan Blessed With Twin Baby Boys Surrogacy Or Adoption.-TeluguStop.com

తన నటనతోనే కాకుండా తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

నయన తొలిసారిగా 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఆ తర్వాత మూడేళ్లకు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.అలా తెలుగుతో పాటు తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది.గతంలో నయనతార వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

అయినా కూడా ఆ సమయంలో సినిమాలకు దూరం కాలేదు ఈ బ్యూటీ.

అలా కొంతకాలం తర్వాత తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమ ఉండి నాలుగు నెలల క్రితమే తన కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా తన ప్రియుడిని వివాహం చేసుకుంది.

ఇక పెళ్లికి ముందు ఈ జంట మాత్రం బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పవచ్చు.అప్పట్లో వీరిద్దరి దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనుమానాలు చాలానే వచ్చాయి.చివరికి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు.ఇక పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చేశారు.ఇద్దరూ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ.అందరికీ దూరంగా వెళ్లి మంచి లైఫ్ ని ఎంజాయ్ చేశారు.ఇక తాము ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ ను విగ్నేష్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉండేవాడు.

నయనతార కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది అని చాలామంది అనుకున్నారు.కానీ ఈ ముద్దుగుమ్మ అప్పటికే కొన్ని సినిమాలకు సైన్ చేసి పెట్టినట్లు తెలిసింది.

అయితే మొన్నటి వరకు హనీమూన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ జంట తాజాగా అమ్మానాన్నలు అయ్యాము అంటూ అందరికీ షాక్ ఇచ్చారు.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.విగ్నేష్ తన సోషల్ మీడియా వేదికగా ఇద్దరి కవల బాబులకు అమ్మానాన్నలం అయ్యాము అంటూ.వారి పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోలను పంచుకున్నాడు.

ఇక ఆయన ఆ విషయాన్ని షేర్ చేసుకున్న కొద్ది క్షణంలోనే ఈ వార్త బాగా వైరల్ అయింది.అయితే ఇంత తొందరగా తల్లితండ్రులు ఎలా అయ్యారు అని ప్రశ్నలు ఎదురవ్వగా.

వీరిద్దరూ పెళ్లికి ముందే సరోగసి ద్వారా పిల్లలను ప్లాన్ చేసినట్లు తెలిసింది.

అయినా నయనతార ప్రెగ్నెంట్ అయినట్లు ఎప్పుడు కూడా కనిపించలేదు అని కొందరు అంటే.

మరి కొందరు వాళ్లు ఇద్దరు బాబులను దత్తత తీసుకున్నారు అని అంటున్నారు.ఇందులో ఏది నిజమో తెలియదు కానీ వారిద్దరూ ఇద్దరు కవల మగ పిల్లలకు అమ్మానాన్నలు అయ్యారు.

మొత్తానికి వీరిద్దరూ తల్లిదండ్రులు కావడంతో తమ ఫ్యాన్స్ ఫుల్ కుష్ లో ఉన్నారు.ఏదైతే ఏంటి.

అందరికీ గుడ్ న్యూస్ వినిపించారు అంటూ తమ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Nayanthara Blessed With Twin Baby Boys Surrogacy or Adoption?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube