ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది.దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు.
ఇటీవలే అభిషేక్ రావు నివాసంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.అదేవిధంగా పలుమార్లు ప్రశ్నించారు.
అభిషేక్ రావు అనూస్ బ్యూటిపార్లర్ అధినేతగా వ్యవహరిస్తున్నారు.అదేవిధంగా రాబిన్ డిస్టిలర్స్ లో డైరెక్టర్ గా ఉన్నారు.
ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే విజయ్ నాయర్, సమీర్ మహేంద్రును సీబీఐ అరెస్ట్ చేసింది.







