శేషగిరిరావు గౌడ్ ని గెలిపిద్దాం:నూనె వెంకట్ స్వామి

యాదాద్రి జిల్లా:దళిత,గిరిజన,మైనారిటీ బీసీ ప్రజలమంతా కలిసి డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ ని గెలిపిద్దామని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి పిలుపునిచ్చారు.ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగామ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 Let's Win Seshagiri Rao Goud: Nune Venkat Swamy-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అంబానీ,ఆదానీల ద్వారా బీజేపీ, కాళేశ్వరం,మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల ద్వారా వేల,లక్షల కోట్ల రూపాయలను మూటగట్టి టీఆర్ఎస్ ఓట్ల కోసం ఎర వేస్తున్నారని,వాటన్నింటిని లక్ష్యపెట్టక బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ పార్టీల,సంఘాల ఉమ్మడి స్వతంత్ర అభ్యర్థి ఈడా శేషగిరిరావు గౌడ్ ను గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో నాయకులు సకినాల హరినాధ్ పటేల్,కర్నాటి యాదగిరి నేత, ముప్పిడి మారయ్య,ఉయ్యాల లింగ స్వామి గౌడ్, మారగోని శ్రీనివాస్ గౌడ్,మంచాల వెంకటేశ్వర్లు,దొడ్డి మల్లయ్య,మంచాల భూపాల్,కురుమిద్ద కిరణ్ కుమార్,కురుమిద్ధ లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube