బాలీవుడ్ సాజిద్ నడియడ్‌వాలా నిర్మించిన మోస్ట్ పాపులర్ ప్రాంచైజీ సినిమా హౌస్ ఫుల్.ఈ ప్రాంచైజీలో ఇప్పటికే వచ్చిన నాలుగు సినిమాలు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ నాలుగు సినిమాలు కూడా సరికొత్త రికార్డులను సృష్టించాయి.ఇక ఇది ఇలా ఉంటే బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం హౌస్ ఫుల్-5 సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ అగ్ర హీరోలు ఐదుగురు నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆ ఐదుగురు అగ్ర హీరోలు ఎవరు అన్న విషయానికి వస్తే.
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశ్ ముఖ్, బాబీ డియోల్, జాన్ అబ్రహం.ఇకపోతే హౌస్ ఫుల్ -4 సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఇక అప్పటినుంచి సాజిద్ నడియడ్‌వాలా హౌస్‌పుల్ ప్రాంచైజీ ని యూనివర్స్‌గా నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నారట.ఐదుగురు హీరోలు ఉండడంతో ఐదుగురి కీ ఒకటే విధమైన ప్రాధాన్యత ఉండడం కోసం సరైన పాయింట్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
ఇక మొత్తానికి ఆ ఐదుగురు హీరోలకు న్యాయం చేయగల పాయింట్ దొరికిందట.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి.ఇక ఈ వర్క్ లో త్వరలోనే పూర్తిచేసుకుని వచ్చే ఏడాది చివరిలో ఈ ప్రాజెక్టును పట్టా లెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఈలోపు కథకు మరిన్ని మెరువులు దిద్ది అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో చాలా కీలకపాత్రలు ఉండడంతో కామెడీకి అద్భుతమైన అవకాశం ఉంటుందని చిత్ర బృందం సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి తెలిపినట్టు సమాచారం.ఇకపోతే ఇప్పటికే విడుదలైన హౌస్ ఫుల్ ప్రాంచైజీ సినిమాలు 2010, 2012, 2016, 2019 ఇలా నాలుగు భాగాలుగా విడుదల అయ్యాయి.
ఇక హౌస్ ఫుల్-5 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఇక ఇప్పటికే విడుదల అయినా 4 ప్రాంచైజీ లో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ లు అన్ని సినిమాల్లో నటించారు.
అభిషేక్ బచ్చన్, బాబీ డియోల్ మూడు, నాలుగో భాగాలలో మాత్రమే కనిపించారు.







