బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వెళ్లి పోయిన తర్వాత ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు.వరుసగా హీరో గా సినిమాలు చేస్తున్నాడా అంటే అది కూడా లేదు.
ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య పెద్దగా చెప్పుకునేట్లు ఏమీ లేదు.అయినా కూడా బుల్లి తెర పై ఆయన ఎందుకు కనిపించడం లేదు అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయమై మల్లెమాల వారు మరియు ఈటీవీ వారు చర్చించుకోవడం కనిపిస్తోంది.జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన సుడిగాలి సుదీర్ స్టార్ మా లో బిజీ యాక్టర్ గా యాంకర్ గా మారుతాడని అంతా భావించారు.
కానీ కామెడీ స్టార్స్ కార్యక్రమాన్ని సుడిగాలి సుదీర్ వెళ్లిన వెంటనే ఎత్తి వేయడం తో ఇప్పుడు అతని భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈటీవీకి మళ్ళీ వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడని రోజా ద్వారా మల్లెమాలలో రీ ఎంట్రీ ఇచ్చి జీవితాంతం ఈటీవీ మరియు మల్లెమాలకు రుణపడి ఉంటాను అంటూ స్నేహితులతో చెబుతున్నాడట.ఈ విషయంలో నిజం ఎంత ఉందో కానీ ప్రస్తుతం ఎప్పుడెప్పుడు సుడిగాలి సుదీర్ ని మళ్లీ బుల్లి తెర పై చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.స్టార్ మా వారు తీసుకోనైతే తీసుకున్నారు కానీ సుడిగాలి సుదీర్ సరైన పద్ధతిలో వినియోగించుకోలేక పోతున్నారని.
ఇప్పటికే ఆయన డేట్లు చాలా వృధా అయ్యాయి.ఆయన ఎంటర్టైన్మెంట్ చాలా మిస్ అయ్యాం వెంటనే సుడిగాలి సుదీర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని స్టార్ మా వారికి ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా సుడిగాలి సుదీర్ ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి.