నేడు చిరంజీవి.. నాడు ఎన్టీఆర్.. విద్వాంసుల చేతిలో అవమానం

చిరంజీవికి గరికపాటికీ మధ్య జరిగిన అలాయి బలాయి కార్యక్రమంలో జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.గరికపాటి చిరంజీవి ని అవమానించినట్టుగా మెగా ఫాన్స్ బాధపడుతున్నారు అంతేకాదు విపరీతంగా గరికపాటిని ట్రోల్ కూడా చేస్తున్నారు.

 Chiranjeevi Incident Happened To Ntr Details, Chiranjeevi, Ntr, Nandamuri Taraka-TeluguStop.com

ఆలాయి బాలాయి కార్యక్రమంలో చిరంజీవి తో ఫోటోలు దిగడానికి ఔత్సాయకులు పెద్ద ఎత్తున ఆయన దగ్గరికి చేరుకోగా పక్కనే ఉన్న గరికపాటి స్పీచ్ ను ఎవ్వరూ వినలేదు.దాంతో ఆగ్రహించిన గరికపాటి సత్వరమే ఫోటోషూట్ ఆపేసి చిరంజీవి రావాలని, లేకపోతే తాను అక్కడ నుంచి వెళ్లిపోతారని మైక్ లో అనౌన్స్ చేశారు.

అంతేకాదు స్పీచ్ మధ్యలో ఆపేసి వెళ్లిపోవడానికి సైతం ప్రయత్నిస్తే ఆర్గనైజర్స్ ఆయనని బ్రతిమాలి మళ్ళీ కూర్చోబెట్టారు.అయితే ఫోటోషూట్ ఆపేసి చిరంజీవి గరికపాటి వద్దకు వెళ్లి ఆయనను క్షమించమని కూడా కోరారు.

అంతేకాదు తమ ఇంటికి భోజనానికి రావాలని కూడా ఆహ్వానించాడు చిరంజీవి.ఇలాంటి సంఘటనే 37 ఏళ్ల క్రితం కూడా జరిగింది అయితే అక్కడ సీనియర్ ఎన్టీఆర్ మరియు మంగళంపల్లి బాల మురళీకృష్ణ మధ్య ఈ సంఘటన జరిగింది.

Telugu Chiranjeevi, Nandamuritaraka, Narthana Sahala, Virataparvam-Movie

బాల మురళీకృష్ణ సంగీత విద్వాంసుడనే విషయం మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ హీరోగా నటించిన నర్తనశాల, విరాటపర్వం వంటి సినిమాల్లో బాలమురళీకృష్ణ పాటలు పాడారు.వాస్తవానికి ఎన్టీఆర్ కి బాల మురళి కృష్ణ పై మంచి అభిమానం ఉండేది.అంతకు మించిన గౌరవం బాలమురళీకృష్ణ కి ఎన్టీఆర్ పైన కూడా ఉండేది.వీరిద్దరి మధ్య సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి విభేదాలు లేకపోయినా, రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం విభేదాలు వచ్చాయి.

Telugu Chiranjeevi, Nandamuritaraka, Narthana Sahala, Virataparvam-Movie

1961 లో లలిత కల అకాడమీ ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని శిల్పా మరియు చిత్ర కళాకారులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు.అయితే ఇందులో గొడవలు, కుమ్ములాటలు ఎక్కువగా జరిగేవి.అకాడమీలో గొడవలు బాగా ఉవ్వెత్తున ఊసిపడుతున్న సమయంలో 1985లో ఆ అవినీతిని, అక్రమాలను అణిచివేయడానికి ఎన్టీఆర్ లలిత కళ అకాడమీ రద్దు చేశారు.దాంతో బాలమురళీకృష్ణ కి, ఎన్టీఆర్ కి విభేదాలు వచ్చాయి ఇక ఇప్పుడు గరికపాటి చిరంజీవి మధ్య వచ్చిన విభేదాలతో అప్పటి సంఘటనను పోల్చి చూస్తున్నారు నాటి మీడియా మిత్రులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube