సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు.టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ తో ఏర్పడిందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం టీఆర్ఎస్ ను స్థాపించారన్న నిర్మలా సీతారామన్.కేసీఆర్ మాటలు నమ్మే ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు.టీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.2014- 2018 వరకు కేబినెట్ లో మహిళకు స్థానం ఇవ్వలేదని విమర్శించారు.మహిళలకు స్థానం ఇవ్వొద్దని మంత్ర తంత్రాలు చేసే వాళ్లు చెప్పారట.మంత్రిగాళ్లు చెప్పినందుకే కేబినెట్ లో మహిళలను తీసుకోలేదా అని ప్రశ్నించారు.మంత్రగాళ్ల సూచనతోనే కేసీఆర్ సచివాలయానికి వెళ్లట్లేదని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.టీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మార్చారు.
తెలుగు కూడా కాదని సంస్కృతం పేరు పార్టీకి పెట్టారన్నారు.తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏమీ చేయలేదన్న కేంద్రమంత్రి.
దేశ ప్రజలకు సేవ చేస్తామంటే ఎవరూ నమ్మరని తెలిపారు.