మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.ఈ క్రమంలో ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.అనంతరం ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.
ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లపై విమర్శలు సంధిస్తున్న రాజగోపాల్ రెడ్డి.మునుగోడులో బీజేపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.







