టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్.ఇటీవల దసరా పండుగ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.
కాగా ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది.
ఇకపోతే హాలీవుడ్ లో ఒకప్పుడు దుమ్ము లేపిన సినిమా జాక్ విన్.ఆ సినిమాలో హీరో తన భార్య గుర్తుగా ఉంచుకున్న కుక్కపిల్లను చంపేశారని యావత్ మాఫియా బ్యాచ్ అందరినీ చంపేయడానికి బ్యాగ్ వేసుకొని బయలుదేరుతాడు జాన్ విక్.అదే ఆ సినిమాలోని అసలు కథ.
అయితే హీరో నాగార్జున అదే కథను ఫాలో అయినప్పటికీ ది ఘోస్ట్ సినిమా మాత్రం అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.హాలీవుడ్ లో జాక్ విన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తెలుగులో విడుదలైన ది ఘోస్ట్ సినిమా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.ఇక హాలీవుడ్ సినిమా జాక్ విన్ స్టైల్ లోనే అంటే యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా గన్నులు మాఫియా ప్రతి ఒక్కటి కూడా యాజీటీజ్ గా చేసినప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.

ఎందుకు గల కారణం జాక్ విన్ తరహాలో ఎమోషన్ ని ఏమాత్రం చూపించకుండా కేవలం స్టైలిష్ గా యాక్షన్స్ అన్ని వేషాలు పెట్టాము అంటే పెట్టాం అన్న విధంగా తలకెక్కించడంతో ఆ సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు.సినిమాలో 20 ఏళ్ల తర్వాత అత్త ఫోన్ చేసింది అనగానే వచ్చిన నాగార్జున ఆమె కోసం మర్డర్లు చేసే అంత ఎమోషన్ సినిమాలో కనిపించదు.అంతేకాకుండా వారు అప్పట్లో విడిపోయిన రీజన్ కూడా నవ్వులు తెప్పించే విధంగా ఉంటుంది.







