ప్రస్తుతం మ్యూజిక్ డైరక్టర్ థమన్ వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు.స్టార్ సినిమాలతో పాటుగా యువ హీరోల సినిమాలకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.సినిమాలో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రెస్టిజియస్ సినిమాలకు పనిచేస్తున్నాడు థమన్.అందులో ఒకటి చరణ్, శంకర్ మూవీ కూడా ఉంది.
శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రెహమాన్ ని కాదని శంకర్ మొదటిసారి వేరే మ్యూజిక్ డైరక్టర్ తో పనిచేస్తున్నారు.
అందుకే ఈ సినిమా మీద థమన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.అంతేకాదు సినిమాలో కొత్త థమన్ ని చూపించడానికి రెడీ అవుతున్నడట.
ఆ సినిమా కోసం తన పాత బ్రెయిన్ ని పక్కన పెట్టి కొత్త బ్రెయిన్ తో పనిచేస్తున్నానని అన్నారు థమన్.మరి థమన్ అంత ఫోకస్ పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా సినిమా అవుట్ పుట్ వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.
ఈమధ్య వరుస సూపర్ హిట్లతో థమన్ తన హవా కొనసాగిస్తున్నాడు.ఆర్సీ 15 సినిమాకు థమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.







