మళయాళ సూపర్ జోడీ ఫాహద్ ఫాజిల్.నజ్రియాలు కలిసి ఓ సూపర్ యాడ్ చేశారు.
లవ్ యాస్ మెనీ ఫ్లేవర్స్ అంటూ కామెరీ ఐస్ క్రీం కోసం ఈ ఇద్దరు కలిసి నటించారు.రియల్ జోడీ కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఈ యాడ్ లో రొమాంటిక్ గా నటించారు.
ఎంతైనా భర్తతో నటించడం అంటే హీరోయిన్స్ కి చాలా ఇష్టం.అందుకే ఈ యాడ్ లో నజ్రియా ఫాహద్ తో రెచ్చిపోయింది.
ఈ యాడ్ లో ఫాహద్ ఫాజిల్, నజ్రియాలు ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని చూపించారని చెప్పొచ్చు.ఐస్ క్రీం యాడ్ కోసం ఈ రేంజ్ లో రెచ్చిపోవాలా అని కొందరు అంటున్నా.
రియల్ జంట ఏం చేసినా చూడముచ్చటగా ఉంటుంది అని కొందరు అంటున్నారు.ఇక వీరి సినిమాల విషయానికి వస్తే పుష్ప లో గుండు బాస్ గా కనిపించాడు ఫాహద్.
పుష్ప 2లో అతనిది చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది.ఇక మరోపక్క నజ్రియా కూడా అంటే సుందరానికీ సినిమాలో నటించింది.అంటే సుందరానికీ హిట్ అయితే నజ్రియాకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చేవి కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.







