తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జై శ్రీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది.జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో హైదరాబాద్ కార్యాలయంలో ఈడీ అధికారులు సుమారు 9 గంటల పాటు విచారించారు.
నిషేధిత బిఎస్-3 వాహనాలను బిఎస్-4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.ఈ మేరకు విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.
జేసీని విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులు అడిగిన వివరాలు ఇచ్చానని, మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారని వెల్లడించారు.
అదేవిధంగా తను ఏ మనీలాండరింగ్ కు పాల్పడలేదని, ఈ కేసులతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.







