ముగిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జై శ్రీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది.

జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో హైదరాబాద్ కార్యాలయంలో ఈడీ అధికారులు సుమారు 9 గంటల పాటు విచారించారు.

నిషేధిత బిఎస్-3 వాహనాలను బిఎస్-4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.

ఈ మేరకు విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.జేసీని విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులు అడిగిన వివరాలు ఇచ్చానని, మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారని వెల్లడించారు.

అదేవిధంగా తను ఏ మనీలాండరింగ్ కు పాల్పడలేదని, ఈ కేసులతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.