సమాధిలో దూరిన ఆరడుగుల కొండచిలువ.. వీడియో వైరల్..

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఎక్కువగా పాములు కనిపిస్తున్నాయి.దీనికి కారణం ఇది వర్షాకాలం కాబట్టి పాములు తిరగడానికి వాతావరణం అనుకూలంగా ఉంది.

 Python Found In A Graveyard At Falaknuma Video Viral Details, Python , Falaknuma-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా పాములకు సంబంధించిన వీడియోలే కొన్ని సెకండ్లలో వైరల్ గా మారిపోతున్నాయి.ఇంకా కొండచిలువ పాము అంటే పాము జాతి లోనే అతిపెద్ద పాము.

కొండచిలువలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.అవి ఏ సైజులో ఉన్న కాస్తంత భయం ఎక్కువగానే ఉంటుంది.

తాజాగా హైదరాబాద్ లోని ఫలక్నుమాలో ఉన్న ముస్లిం స్మశాన వాటికలో ఒక పెద్ద కొండచిలువ కనిపించింది.

ఆరు అడుగులకు పైగా ఉన్నా ఈ పొడవైన కొండచిలువ ఒక సమాధిలో నుంచి మరొక సమాధి లోకి వెళ్తుండగా చూసిన స్థానికులు అక్కడ జరిగిన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దాంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో వినిపిస్తున్న మాట్లాడుతున్న మాటల ప్రకారం ఫలక్నుమాలోని ఖాద్రి చమన్ స్మశాన వాటికలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఇంత పెద్ద భారీ కొండచిలువ కనిపించడంతో ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు, తరచుగా అటువైపు వివిధ పనులపై తిరుగుతూ ఉండడంవల్ల చాలా భయపడుతున్నారు.

అంతేకాకుండా ఆ స్మశానవాటికలో ఒక పెద్ద చింత చెట్టు ఉన్నందున చింతకాయల కోసం తరచుగా పిల్లలు ఇక్కడికి వచ్చి చింతకాయలు తెంచుకుంటూ ఉంటారు.అందుకే ఆ కొండచిలువను పట్టుకోవాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అక్కడి ప్రజలు వెల్లడించారు.ఈ వీడియోలో చూసినట్లు ఆ కొండచిలువ అక్కడే సమాధుల మధ్య దాని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అర్థమవుతుంది.

ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అక్కడి స్థానికులకు వస్తున్న మరో సందేహం ఏమిటంటే సమాధుల కింద ఇలాంటి పాములు ఇంకెన్ని ఉన్నాయో అని అక్కడి స్థానికులు ఎక్కువగా భయపడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube