ఎన్టీఆర్ జిల్లా మైలవరం మైలవరం రైతుబజార్ లో ఈఓ మోసం చేస్తున్నారు అని ఓ రైతు ఆరోపించాగా,రైతు బజార్ లో రెండు షాపులు కేటాయించి డిపాజిట్ అని చెప్పి షాపుకు 40వేల రూపాయలు లంచం ఈఓ రవి కుమార్ తీసుకున్నారని ఆరోపిస్తున్న భాదితులు,షాపులు కేటాయించకపోవడంతో జాయింట్ కలెక్టర్ దృష్టికి తమ సమస్యని తీసుకెళ్లారు డిపాజిట్ కాదు లంచం అని తెలుసుకుని లబోదిబోమన్న భాదితులు,విచారణ కోసం రవికుమార్ విధులకు హాజరవ్వకుండా ఆదేశాలిచ్చిన ఉన్నతాదికారులు ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న చిట్టిబాబు తమ రెండుషాపులు ఈఓ ఖాళీ చేయాలని చెప్పడంతో రైతుబజార్ ఆవరణలో అల్లం,వెల్లుల్లి,జ్యూట్ బ్యాగులతో నిరసన తెలుపుతున్న భాదితులు అనుమతులు లేకుండా రైతు బజార్ ఆవరణలో ఎండు చేపల స్టాల్స్ ఎలా పెట్టారు అని ప్రశ్నించారు,కాసుల కక్కుర్తి లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మైలవరం రైతు బజార్ పై స్థానిక రైతులు పలు ఆరోపణలు చేస్తున్నారు.







