గత పది సంవత్సరాల క్రితం బుల్లితెరపై ప్రసారమైన కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతమైన రేటింగ్స్ సొంతం చేసుకుని ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇలా జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఏకంగా సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో మొదట్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్ లు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఇలా ఎంతో మంది ఈ కార్యక్రమానికి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని బయటకు వెళ్ళిపోతున్నారు.కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో కొనసాగుతూనే ఉన్నారు రాకెట్ రాఘవ.
ఎన్నో సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నప్పటికీ జబర్దస్త్ కార్యక్రమాన్ని మాత్రం మిస్ కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే రాకెట్ రాఘవకి సైతం ఇతర చానల్స్ నుంచి పెద్ద ఎత్తున ఆఫర్స్ వస్తున్నాయట మల్లెమాల వారి ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా రెండింతలు అధిక రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ ఈయన మాత్రం జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వేయలేదు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదలకపోవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే తనకు డబ్బు కన్నా మల్లెమాల వారితో ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని తెలిపారు.అయితే ఈ జబర్దస్త్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో 10 సంవత్సరాలను పూర్తిచేసుకున్న సందర్భంగా భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ ఈవెంట్లో రాకెట్ రాఘవకు ప్రత్యేకమైన పురస్కారం అందే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.గత పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళకుండా ఈ కార్యక్రమంలో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి రాకెట్ రాఘవ అని చెప్పాలి.







