స్వాతిముత్యం రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో ఈరోజు విడుదలైన సినిమా స్వాతిముత్యం.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు.

రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన.ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, రావు రమేష్, నరేష్, ప్రగతి, సురేఖా వాణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటించారు.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్, మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

ఇక కొత్త హీరోగా అడుగుపెట్టిన బెల్లంకొండ గణేష్ కు ఇది తొలి సినిమా కాబట్టి ఎటువంటి సక్సెస్ అందిస్తుందో చూద్దాం.ఇంతకీ బెల్లంకొండ గణేష్ ఎవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడే.మరి బెల్లంకొండ గణేష్ తన సోదరుడికి తగ్గట్టుగా పేరు సంపాదించుకుంటాడో లేదో చూడాలి.

కథ

: ఇందులో బెల్లంకొండ గణేష్ బాలమురళి పాత్రలో కనిపించాడు.ఇతడికి భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ) అంటే చాలా ఇష్టం.ఇక బాల మురళి స్వాతిముత్యంగా కనిపిస్తాడు.అయితే బాలమురళి భాగ్యలక్ష్మిని తొలిచూపులతోనే ఇష్టపడటంతో.తన ప్రేమ గురించి చెప్పడానికి బాగా ఇబ్బంది పడుతూ అమాయకంగా కనిపిస్తాడు.

చివరికి తన అమాయకత్వంతో భాగ్యలక్ష్మిని పడేస్తాడు.ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా వీరి పెళ్లికి వీరి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటారు.

ఇక పెళ్లి అవుతున్న సమయంలో బాలమురళి కి ఒక సంఘటనలో ఇరుకుతాడు.దాంతో పెళ్లి ఆగిపోతుంది.

ఎలా పెళ్లి సమయంలో బాలమురళికి ఎదురైన సంఘటన ఏంటి.చివరికి తను ప్రేమించిన భాగ్యలక్ష్మి ని పెళ్లి చేసుకుంటాడా లేదా మిగిలిన కథలోనిది.

నటినటుల నటన

: తొలిసారిగా నటించిన బెల్లంకొండ గణేష్.తన అమాయకత్వపు పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా తన నటన మాత్రం అద్భుతంగా ఉంది.ఇక వర్ష కూడా తన పాత్రతో అద్భుతంగా నటించింది.ఇక మిగిలిన నటీనటులు ఎప్పటిలాగే తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

కథ వరకు మాత్రం డైరెక్టర్ బాగానే చూపించాడు.సాగర్ మహతి అందించిన మ్యూజిక్ బాగుంది.సూర్య తేజ సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన సాంకేతిక విభాగాలు బాగా పనిచేశాయి.

విశ్లేషణ:

తొలి పరిచయంతోనే హీరోని స్వాతిముత్యం చేశాడు డైరెక్టర్.తొలి పరిచయం అనేది స్ట్రాంగ్ పాత్ర అయితే మరింత బాగుండేది.ఇక కథ మాత్రం ఎంటర్టైన్ గా చూపించారు.

ప్లస్ పాయింట్స్:

కథ, సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కామెడీ, ట్విస్ట్.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలలో మార్పులు ఉంటే బాగుండేది.

బాటమ్ లైన్:

ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వారికి మాత్రమే ఈ సినిమా బాగా నచ్చుతుంది.యాక్షన్ సన్నివేశాలు లేవు కాబట్టి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చూడవచ్చు.

రేటింగ్: 2/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube