మీరు కొన్ని సార్లు పిల్లలతో సహా రైలు ప్రయాణం చేసే అవసరం రావొచ్చు.అలాంటప్పుడు సహజంగానే మీకు ఇలాంటి డౌట్స్ రావొచ్చు.
అయితే అవి తెలుసుకోవడం తప్పనిసరి.ఏ వయస్సు లోపు ఉన్నవారికి రైలు టికెట్ అవసరం లేదు? ఫుల్ టికెట్ తీసుకోవాలా? హాఫ్ టికెట్ తీసుకోవాలా? రైలు టికెట్ బుకింగ్ రూల్స్ ఎలా ఉంటాయి? అన్న విషయాలపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలి.లేదంటే అనవసరమైన సమస్యలు వచ్చి ప్రయాణం మొత్తం డిస్టర్బ్ అవుతుంది.
పిల్లలకు రైలు టికెట్ల బుకింగ్ విషయంలో పలు నియమనిబంధనల్ని రూపొందించింది రైల్వే.
ఈసారి పిల్లలతో రైలు ప్రయాణం చేసేప్పుడు మీరేం గుర్తుంచుకోవాలో తెలుసుకోండి.భారతీయ రైల్వే నియమనిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లలకు రిజర్వేషన్ అవసరం లేదు.
రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ రైళ్లకు ఇదే రూల్ వర్తిస్తుంది.ఒకవేళ పిల్లలకు కూడా ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ అడల్ట్ ఫేర్ అంటే పూర్తి ఛార్జీ చెల్లించి బెర్త్ రిజర్వేషన్ చేయించుకోవాలి.
లేదా ఆ రైలులో ఇన్ఫాంట్ సీట్స్ ఉంటే ఆ ఆప్షన్ ఎంచుకోవచ్చు.దీనికి ఛార్జీ ఏమీ ఉండదు.
దీన్నే బేబీ బెర్త్ అని పిలుస్తున్నారు.ఇటీవల ఇన్ఫాంట్ బెర్త్ ఆప్షన్ ఒకట్రెండు రైళ్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఒకవేళ ఐదేళ్ల లోపు పిల్లలకు బెర్త్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం పూర్తి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ పిల్లలు వికలాంగులు అయితే దివ్యాంగుల కోటాలో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది.ఇక ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు రిజర్వేషన్ సమయంలో బెర్త్ కోరుకుంటే పూర్తి ఫేర్ చెల్లించాలి.బెర్త్ వద్దనుకుంటే సగం ఫేర్ చెల్లించాలి.రిజర్వ్‌డ్ సిట్టింగ్ అకామడేషన్‌లో మాత్రం పూర్తి ఫేర్ వర్తిస్తుంది. CC, EC, 2S, EA లాంటి క్లాసుల్లో బెర్త్ వద్దని నిరాకరించే ఆప్షన్ ఉండదు.
అన్‌రిజర్వ్‌డ్ రైళ్లల్లో 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు సగం ఛార్జీ వర్తిస్తుంది.ఇక 12 ఏళ్లు దాటిన పిల్లలకు అన్ని రైళ్లల్లో పూర్తి ఛార్జీ వర్తిస్తుంది.







