ఇకనుండి అన్ని గాడ్జెట్లకు ఒకటే రకమైన కేబుల్.. ఏరకమంటే?

స్మార్ట్‌ఫోన్ల విషయంలో చాలా మందికి వేధించేది చార్జింగ్.ఇంటి నుంచి ఆఫీసుకు లేదా వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు సొంత చార్జర్ మర్చిపోయినపుడు తీరా మొబైల్ లో ఛార్జింగ్ అయిపోయినపుడు ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేనిది.

 From Now On All Gadgets Will Have The Same Cable, Gadgets, Technology Updates,-TeluguStop.com

ఎదుటివారిని అడగలేము, మనలేము.బయటకి వెళ్లిన ప్రతిసారీ చార్జింగ్ పెట్టుకోవడం లేదా చార్జర్ పట్టుకోవడం అనేది కొన్నిసార్లు కుదరదు.

కొందరి దగ్గర నార్మల్ కేబుల్ చార్జర్ ఉంటే.ఇంకొందరి దగ్గర టైప్-సి కేబుల్ ఉంటుంది.

దీంతో ఒక డివైజ్‌పై పని చేసే కేబుల్ మరో డివైజ్‌కు పనిచేయదు.

ఈ ఛార్జింగ్ గోల మానమొక్కరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఇలాంటి సమస్యతో కాస్త సతమతం అవుతున్నారు.

ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది EU (యురోపియన్ యూనియన్).తమ యూనియన్‌ పరిధిలో విక్రయించే అన్ని డివైజ్‌లకు టైప్-సి కేబుల్ మాత్రమే వాడేలా చట్టం చేసింది.2024 చివరికల్లా యురోపియన్ యూనియన్ పరిధిలో విక్రయించే ప్రతి డివైజ్.టైప్-సి చార్జర్‌తోనే పని చేయాలి.

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచెస్, డిజిటల్ కెమెరాలు వంటి చిన్న గాడ్జెట్స్ అన్నింటికీ ఇదే కేబుల్ వాడాలి.చివరికి కొత్తగా వచ్చిన ఐఫోన్లకు కూడా ఈ కేబులే ఉండాలి.

Telugu Ctye Cable, Gadgets, Ups-Latest News - Telugu

2026 కల్లా ల్యాప్‌టాప్‌తోపాటు అన్ని డివైజ్‌లు, గ్యాడ్జెట్లకు కూడా టైప్-సి కేబుల్ ఉండాల్సిందే.ఇది అనేక కంపెనీలకు ముఖ్యంగా.యాపిల్ సంస్థకు పెద్ద దెబ్బే.ఎదుకంటే ఈ సంస్థ ప్రత్యేకంగా లైట్నింగ్ పోర్టుల్ని మాత్రమే చార్జింగ్ కోసం తయారు చేస్తుంది.కానీ, ఇకపై ఇలా కుదరదు.యాపిల్ కూడా తమ ఫోన్లు, ట్యాబ్లెట్లుసహా అన్ని గ్యాడ్జెట్లను టైప్-సి కేబుల్‌కు అనుగుణంగానే తయారు చేయాలి.

ఈయూలో అమ్ముడవుతున్న గ్యాడ్జెట్లలో 20 శాతం యాపిల్ ఉత్పత్తులే.ఇక ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు చాలా మేలు జరుగుతుంది.

అన్నింటికీ ఒకే కేబుల్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube