సినిమాలో ఆ సీన్ హైలెట్.. ఘోస్ట్ పై నాగార్జున కామెంట్స్!

హీరో అక్కినేని నాగార్జున,సోనాల చౌహన్ జంటగా నటించిన తాజా చిత్రం ది గోస్ట్.

ఈ సినిమా నేడు అనగా దసరా పండుగ రోజు కానుకగా అక్టోబర్ 5న విడుదల అయింది.

ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దశకత్వం వహించిన విషయం తెలిసిందే.సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాగార్జున మాట్లాడుతూ.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.

Advertisement

సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్ సీన్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి అని తెలిపారు నాగార్జున.అదేవిధంగా క్లైమాక్స్ సీన్ లో వచ్చే చర్చ్ ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది అని తెలిపారు నాగార్జున.

అదేవిధంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా ఈ సినిమాలో 12 యాక్షన్స్ సీన్లు ఉన్నట్లు తెలిపారు.

ఇకపోతే ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి మొదలైంది.పండుగ రోజు థియేటర్ల వద్ద మరింత పండుగ వాతావరణం నెలకొంది.నాగార్జున కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక అప్పుడప్పుడు పలు రకాల కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు నాగార్జున.మరి ది గోస్ట్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు