అమెరికాలో భారతీయులే టార్గెట్‌గా ఇటీవల విద్వేషదాడులు , ఇతర నేరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.గత వారం కూడా ఓ ఇండో అమెరికన్ ఫుడ్ డెలివరి బాయ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడో దుండగుడు .
ఈ సంఘటన మరిచికపోముందే .నలుగురు సభ్యులున్న ఓ భారతీయు కుటుంబాన్ని గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారు.కాలిఫోర్నియాలో జరిగిన ఘటనలో తల్లిదండ్రులతో పాటు 8 నెలల చిన్నారిని మరో వ్యక్తిని అపహరించుకుపోయినట్లు స్థానిక వార్తా సంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి.వీరిని జస్‌దీప్ సింగ్, జస్లీన్ కౌర్, ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరితో అమన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు.
బాధిత కుటుంబం మెర్సిడ్ కౌంటీలో నివసిస్తోంది.ఇక్కడికి దగ్గరలోని బ్లాక్ నెంబర్ 800, సౌత్ హైవే 59లో జస్‌దీప్ ఓ షాపును నిర్వహిస్తున్నారు.
ఇక్కడికి వచ్చిన ఇద్దరు ఆగంతకులు నలుగురిని తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది.దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
సాధారణంగా వీరు కిడ్నాప్‌కు గురైన హైవే 59 అత్యంత రద్దీగా వుండే ప్రాంతం.ఇక్కడ పెద్ద సంఖ్యలో రెస్టారెంట్స్, రిటైల్ షాప్స్ వున్నాయి.
అలాంటి చోట నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.అయితే అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారనేది మాత్రం తెలియరాలేదు.

ఆగంతకుల నుంచి ఎలాంటి డిమాండ్స్ అందకపోవడంతో వీరందరి క్షేమ సమాచారంపై బంధుమిత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు కాలిఫోర్నియాలో హై అలర్ట్ ప్రకటించారు.సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.దుండగులకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా తమను సంప్రదించాలని.911కి ఫోన్ చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇకపోతే.
కాలిఫోర్నియాలో భారతీయులు కిడ్నాప్ కావడం ఇదే తొలిసారి కాదు.గతంలో 2019లో ఓ డిజిటల్ మా
.