విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాందించుకున్నాడు ధనుష్.జాతీయ నటుడిగా అవార్డు అందుకుని హాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటూ అక్కడి కూడా సినిమాలు చేస్తున్నాడు.
ధనుష్ నటిస్తున్న సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.
దీంతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.‘సార్’ అనే టైటిల్ తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.బైలింగ్వన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.తమిళ్ లో ‘వాతి’ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాతో పాటు ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్రకటించాడు.ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.మేకర్స్ ఈ సినిమా స్టార్ట్ చేయడానికి సమయం ఫిక్స్ చేసినట్టు టాక్ వస్తుంది.ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి నుండి స్టార్ట్ చేయనున్నారని లేటెస్ట్ గా సమాచారం బయటకు వచ్చింది.మరి ఈ సినిమాపై ముందే నుండే అంచనాలు భారీగానే ఉన్నాయి.
చూడాలి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.







