యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా మారిపోయాడు.అయితే బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలతో ఈయన ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశ పరిచాడు.
దీంతో ఇప్పుడు అందరి ఆశలు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా మీదనే ఉన్నాయి.బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి.
ఈసారి ఆదిపురుష్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఆదిపురుష్ మేకర్స్.
ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు.ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.
చాలా మంది ఇందులో గ్రాఫిక్స్ గురించి ట్రోల్స్ చేస్తున్నారు.మరి డార్లింగ్ బాహుబలి తర్వాత చేసిన సినిమాల్లో కామం పాయింట్ టి సిరీస్ సంస్థ, యువీ క్రియేషన్స్ అసోసియేషన్ అవ్వడమే అని తెలుస్తుంది.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూడు సినిమాలను ఈ బ్యానర్ల పైనే నిర్మించారు.
అందుకే ఇప్పుడు ఆదిపురుష్ విషయంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ భయపడు తున్నారు.
ముందు నుండి సినిమాలను సరిగ్గా ప్రోమోట్ చేయక పోవడమే ఆదిపురుష్ కు అంత ట్రోలింగ్ రావడానికి కారణం అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత సినిమాలకు కూడా సరిగ్గా ప్రొమోషన్స్ చేయలేదు.
ఇక ఇప్పుడు కూడా ముందు నుండి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయక పోవడం వల్ల మరింత ఊహించుకుని ఇప్పుడు వచ్చిన టీజర్ ను చుసిన ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
వరల్డ్ క్లాస్ మైథలాజికల్ విజువల్ వండర్ ని అందిస్తారు అని ఆశ పడిన వారికీ ఒక యానిమేటెడ్ కార్టూన్ ఫిలిం ఇస్తున్నారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.అలా కాకుండా ముందు నుండి ముందు నుండి ఇలా ఉంటుంది అని పోస్టర్స్ రిలీజ్ చేసి ఉంటే ఇంత ట్రోల్స్ ఉండేవి కాదు అని అంటున్నారు.మరి ఈ ట్రోలింగ్ ను ఆదిపురుష్ పట్టించు కుంటారో లేదో చూడాలి.
ఇక ఇదే సంస్థలతో స్పిరిట్ కూడా చేయాల్సి ఉంది.మరి దీని పరిస్థితి ఏంటో అనే ఆలోచనలో అందరిలో భయం కలిగిస్తుంది.