హైదరాబాద్ పర్యటనకు ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్

ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలకలేదని తెలుస్తోంది.

 Shashi Tharoor, Aicc President Candidate, To Visit Hyderabad-TeluguStop.com

సొంత పార్టీకి చెందిన ఎంపీ, అధ్యక్ష బరిలో నిలిచిన వ్యక్తి వస్తే ఇలా ప్రవర్తించడం ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.ఈ క్రమంలో ఆయన రాష్ట్ర నాయకులను కలవకుండానే మీడియా సమావేశం నిర్వహించారు.

ఓ వైపు శశిథరూర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే ఎన్నికల బరిలో నిలిచాననీ.ఈ క్రమంలోనే నేతలందరినీ కలుస్తానంటున్నారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరో అభ్యర్థిగా బరిలో నిలబడిన మల్లికార్జున ఖర్గేకు మద్ధతు ప్రకటించారు.ఇదిలా ఉంటే గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, శశిథరూర్ ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube