ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు హాసిని అండ్ హారిక సితార ఎంటర్టైన్మెంట్స్.కాగా మొదట త్రివిక్రమ్ జులాయి సినిమాతో మొదలైన ఈ నిర్మాత రాధాకృష్ణ ప్రయాణం ఇప్పటికీ అదే తరహాలోనే కొనసాగుతోంది.
నిర్మాత రాధాకృష్ణ తరువాత అదే బాటలో చేరిన వారి అబ్బాయి నాగ వంశీ కూడా అదే రీతిలో వరుసగా సితార ఎంటర్టైన్మెంట్స్ పై సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఈ సంస్థలో నిర్మించిన దాదాపు పది సినిమాలో త్వరలోనే విడుదల కానున్నాయి.
మరి ఆ పది సినిమాలు ఏవేవి అన్న విషయానికి వస్తే.బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది.అదేవిధంగా ధనుష్‌తో కలిసి నిర్మించిన సార్ అనే సినిమా కూడా డిసెంబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే ఈ హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించిన బుట్ట బొమ్మ అనే మరో సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.
అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మహేష్ బాబు 28వ సినిమాను కూడా ఇదే సంస్థలో నిర్మించనున్నారు.

అలాగే సిద్దు జొన్నలగడ్డ నటించిన బిజెపి ఇల్లు సినిమా కూడా ఈ బ్యానర్లో నిర్మించినదే.నవీన్ పోలిశెట్టి,రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి,ఫరియా అబ్దుల్లా కలిసి నటించిన జాతి రత్నాలు సినిమా కూడా ఈ సంస్థలో నిర్మించినదే.అలాగే మెగా హీరో వైష్ణవ తేజ్ తో కూడా ఒక సినిమాను చేయబోతున్నారు.
ఈ సినిమాలతో పాటుగా రాబోయే రోజుల్లో మరి కొన్ని పెద్ద పెద్ద సినిమాలను కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బాలకృష్ణ రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలు త్వరలోనే మొదలు పెట్టారని చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.