బాహుబలి, ఆదిపురుష్ సినిమాలకు హిందీలో ప్రభాస్ కు వాయిస్ ఇచ్చింది ఎవరు?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Sharad Kelkar Voice For Prabhas In Adipurush's Hindi Version, Sharad Elkar,prabh-TeluguStop.com

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో కూడా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్,కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆసక్తిని కనపరుస్తున్నారు.

ఇకపోతే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆదిపురుష్ సినిమా నుంచి భారీ అప్డేట్ విడుదల చేసింది చిత్ర బృందం.

ఎట్టకేలకు అభిమానాన్ని నిరీక్షణకు ఫలితం దక్కింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ టీజర్ ను విడుదల చేసిన గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ ని దక్కించుకుంది.ఆదిపురుష్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

కాగా ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ లోనూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Aadi Purush, Baahubali, Prabhas, Sharad Elkar, Sharad Kelkar-Movie

అయితే హిందీలో తన పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదు అన్న విషయం తెలిసిందే.నటుడు శరద్ కేల్కర్ ఆదిపురుష్ లో ప్రబాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.గతంలో కూడా బాహుబలి చిత్రం సమయం లోనూ డార్లింగ్ పాత్రకు శరద్ నే వాయిస్ ఓవర్ అందించారు.

కాగా రామాయణం ఇతిహాసం ఆధారంగా రాబోతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా,కృతి సనన్ సీతగా,సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.తాజాగా విడుదల అయినా టీజర్ లో భూమి కుంగినా.నింగి చీలినా.న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం.

వస్తున్నా.న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచి వేయడానికి.

ఆగమనం.అధర్మ విధ్వంసం.అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube