ఏవైనా ప్రయోగాలు చేస్తున్నప్పుడు అవి ఫెయిలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.అయితే ఆ ప్రయోగం ఫెయిలైతే ఆ తర్వాతి పర్యవసానాలను ఎదుర్కొనేంత శక్తి ఉండాలి.
ఒకవేళ ఆ ప్రయోగం ఒక వ్యక్తికి మాత్రమే చెందినదైతే ఎవరూ పెద్దగా భయపడనక్కర్లేదు కానీ సమస్త మానవాళికి సంబంధించినదయితే ప్రపంచం మొత్తం వణికిపోవాల్సిందే.ఇప్పుడు అలాంటి ప్రయోగమే అమెరికన్ సైంటిస్టులు చేయబోతున్నారు.
ఇంతకీ ఏంటా ప్రయోగం.అసలు సంగతి తెలుసుకుంటే.
అమెరికన్ పరిశోధకులు జెనిటిక్ ఇంజనీరింగ్ సాయంతో వేలాది సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవులను మళ్లీ పుట్టించేందుకు రీసెర్చ్‌లు చేస్తున్నారు.కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భూ ప్రపంచంపై తిరిగిన డైనోసార్లు, ఏనుగు లాంటి మమ్మూత్లతో సహా సూక్ష్మమైన ప్రాణులకు సైతం వీరు మళ్లీ ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
కాగా వీటిలో మమ్మూత్ జీవికి తిరిగి ప్రాణం పోయడమనేది చాలా పెద్ద రిస్క్‌గా అనిపిస్తోంది.నిజానికి ఇదొక ఏనుగు.
కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంటుంది.దీనికి సింహంలాంటి జూలు, పెద్ద దంతాలు ఉంటాయి.
చరిత్రకారుల ప్రకారం మమ్మూత్లు 50 లక్షల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల మధ్య భూమిపై జీవించాయి.వీటిని తిరిగి మళ్లీ భూమి మీదకు తీసుకొచ్చేందుకు “కొలోసల్ బయోసైన్సెస్అనే అమెరికన్ సంస్థ ఒక ఆపరేషన్ ప్రారంభించింది.
ఈ ఆపరేషన్ ఖర్చులను పీటర్ థీల్, టోనీ రాబిన్స్, పారిస్ హిల్టన్, వింక్లెవోస్ తదితరులు భరిస్తున్నారు.ఇప్పుడు మమ్మూత్లకు తిరిగి ప్రాణం పోయేలంటే దానికి దగ్గరగా ఉన్న ప్రస్తుత ఏనుగులపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది.
ఆ ఏనుగుల నుంచే వీటిని పుట్టించాల్సి ఉంటుంది.ఇందుకు అంతరించిపోయిన జీవి DNAను వాడతారు.
తర్వాత చాలా జాగ్రత్తగా ప్రయోగాలు చేసి ఆపై చిన్న చిన్నగా వీటిని సృష్టిస్తారు.

రిపోర్ట్స్ ప్రకారం ఆల్రెడీ మమ్మూత్ ఎముకల నుంచి DNA కలెక్ట్ చేశారు.అంతేకాదు, వాటి జన్యువును కూడా డీకోడ్ చేశారు.ఇక ఇప్పుడు క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ సాయంతో జన్యు సవరణను వాడనున్నారు.
తద్వారా మమ్మూత్లు, టాస్మానియన్ పులుల పుట్టించనున్నారు.వీటిని తీసుకురావడం వల్ల ఆర్కిటిక్ మంచు ఖండంలో వాతావరణం సాధారణ స్థితికి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
మరి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.







