ది ఘోస్ట్ డైరక్టర్ కి నాగార్జున మరో ఛాన్స్..!

గుంటూర్ టాకీస్ సినిమాతో డైరక్టర్ గా సత్తా చాటిన ప్రవీణ్ సత్తారు.గరుడవేగ సినిమాతో సూపర్ అనిపించాడు.

 King Nagarjuna Another Chance To The Ghost Director Praveen Sattaru , Director P-TeluguStop.com

ఇక ఇప్పుడు కింగ్ నాగార్జునతో ది ఘోస్ట్ అంటూ రాబోతున్నాడు.నాగార్జునని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా స్టైలిష్ యాక్షన్ మూవీతో ఈ సినిమా చేశాడు.

అయితే దాదాపు ఎన్నో సినిమాల అనుభవం ఉన్న నాగ్ ప్రవీణ్ లోని టాలెంట్ ని గుర్తించాడు.అందుకే ది ఘోస్ట్ తర్వాత మళ్లీ మరో సినిమా అతనికి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

ది ఘోస్ట్ సినిమా మీద పూర్తి సంతృప్తిగా ఉన్న నాగార్జున సినిమా హిట్ అయితే వెంటనే ప్రవీణ్ కి మరో ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.ఇప్పటికే ప్రవీణ్ సత్తారు నాగార్జున కోసం మరో కథ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

సో ఘోస్ట్ హిట్టు కొడితే మళ్లీ ఇదే టీం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.ది ఘోస్ట్ సినిమా చిరు గాడ్ ఫాదర్ కి పోటీగా వస్తుంది.

అయితే రేసులో మెగా మూవీ ఉన్నా తన సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు నాగ్.ఈ సినిమాలో సోనాలి చౌహాన్ హీరోయిన్ గా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube