సుప్రీం తీర్పుపై స్పందించిన పూనమ్ కౌర్.. అబార్షన్ గురించి అలా చెబుతూ?

హీరోయిన్ గా పరిమితంగా సినిమాలలో నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూనమ్ కౌర్ కొన్ని విషయాల గురించి పరోక్షంగా చేసే కామెంట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి.

 Heroine Poonam Kaur Comments About Supreme Court Verdict Details Here Goes Viral-TeluguStop.com

తాజాగా పూనమ్ కౌర్ సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.గర్భాన్ని తొలగించుకోవడానికి మహిళలు వివాహితులై ఉండాలన్న నియమం లేదని సుప్రీం కోర్టు పేర్కొనడం గమనార్హం.

చట్టపరమైన, సురక్షితమైన అబార్షన్ కు పెళ్లి కాని మహిళలు కూడా అర్హులేనని పూనమ్ కౌర్ వెల్లడించడం గమనార్హం. మెడికల్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం పెళ్లి కాని మహిళలకు ఒంటరిగా జీవనం సాగిస్తున్న మహిళలకు కూడా అబార్షన్ చేసుకునే హక్కు అయితే ఉందని పూనమ్ కౌర్ వెల్లడించడం గమనార్హం.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి పూనమ్ కౌర్ స్పందిస్తూ మహిళ గర్భం దాల్చిన తర్వాత పురుషులు రిలేషన్ షిప్ కు కట్టుబడి ఉండాలని బలవంతం చేయడం తాను చూశానని ఆమె అన్నారు.

అబార్షన్ కు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నేను మద్దతు ఇస్తున్నానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి, పెళ్లిని కాపాడుకోవడానికి మహిళలు గర్భం దాల్చడం నేను చూశానని పూనమ్ కౌర్ వెల్లడించారు.కానీ అలా చేయడం వల్ల ఒక వ్యక్తి లైఫ్ లాంగ్ బాధ పడాల్సి ఉంటుందని పూనమ్ కౌర్ తెలిపారు.

స్వార్థ ప్రయోజనాల కొరకు స్రీలు తమ పునరుత్పత్తి శక్తిని వినియోగించుకోకూడదని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.

Telugu Poonam Kaur, Supreme, Prakash Raj, Supreme Verdict-Movie

ఎవరినో టార్గెట్ చేసి పూనమ్ కౌర్ ఈ కామెంట్లు చేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ను గెలిపిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తానని పూనమ్ కౌర్ గతంలో వెల్లడించారు.అయితే ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో గెలవకపోవడంతో పూనమ్ కౌర్ తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించడానికి ఇష్టపడలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube