టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడంటూ వచ్చిన కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదని స్పష్టం చేశారు.
సమయం ఉన్న నేపథ్యంలో టోర్నీలో బుమ్రా ఆడే అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేమని అన్నారు.బుమ్రా అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
అయితే వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రాను సెలెక్టర్లు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు.అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ కు స్థానం కల్పించిన విషయం తెలిసిందే.
అయితే గంగూలీ తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహం కలిగిస్తోన్నాయి.







