'పుష్ప 2' రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్.. అప్పుడే రాబోతోందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.ఈ సినిమా అల్లు అర్జున్ కు ఎంత కలిసి వచ్చిందో.మిగతా వారికీ కూడా అలానే కలిసి వచ్చింది.ఈ సినిమాలో నటించిన వారు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.పుష్ప సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

 Pushpa The Rule Part 2 Release Date Details, Allu Arjun, Pushpa 2 , Pushpa 2 Rel-TeluguStop.com

గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.

హిందీలో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సన్నాహాల్లోనే అందరు బిజీగా ఉన్నారు.పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలే పెరిగాయి.

అందుకే సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.

కాగా పుష్ప 2 సినిమా ఇంకా రెగ్యురల్ షూట్ కే వెళ్ళక ముందే అప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ పై లేటెస్ట్ గా అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా అక్టోబర్ లో రెగ్యురల్ షూట్ మొదలు కాబోతుంది.దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో పుష్ప 2 సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది అని టాక్ బయటకు వచ్చింది.

అలానే ఈ సినిమా తారాగణం పై కూడా ఏదొక వార్త వస్తూనే ఉంది.

Telugu Allu Arjun, Sukumar, Pushpa, Pushpa Rule, Pushparaj-Movie

ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో నటిస్తుంది అని టాక్ వస్తుంది.సాయి పల్లవి ఈ సినిమాలో గిరిజన యువతి పాత్రలో కనిపించ నుందని తెలుస్తుంది.ఇంకా సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా పుష్ప 2 లో భాగం కానుందట.

మరి వీటిలో ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాల్లో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube