పథకాల పేరు చెప్పి సీఎం కేసీఅర్ చేసింది మోసమేనని, ఎవరు ప్రశ్నించకూడదని, ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా ఉందని షర్మిల విమర్శించారు.కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు.8 ఏళ్లుగా అంతా గారడీ మాటలే చెప్తున్నారని, ఉద్యోగాలు లేక వందల మంది బిడ్డలు చనిపోతే రూపాయి కూడా సహాయం చేయలేదని విమర్శించారు.కేసీఅర్ అవినీతిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఏనాడు ప్రశ్నించలేదన్నారు.
వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని, వైఎస్సార్ సంక్షేమ పాలన కావాలని కోరుకుంటున్న ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలని షర్మిల పిలుపిచ్చారు.







