చాలామంది ప్రజలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒక చిన్న పాటి నీటి ప్రవాహాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు.అలాంటిది సముద్రంలో ఎగిరే అలలలాగా ఎగిసిపడుతూ దూసుకొస్తున్న నీటిని చూస్తే ప్రాణ భయంతో పరుగు పెట్టడం చేస్తూ ఉంటారు.
అయితే నీటి ప్రవాహం చూస్తేనే ఇలా భయపడిపోతున్న ప్రజలు కుప్పంకిన నదిలా ప్రళయం సంభవిస్తే ఎగిసిపడుతూ వచ్చే అలాగా లావా ప్రవహించడానికి చూసి అక్కడి ప్రజలు ప్రాణాల్ని గుప్పట్లో పెట్టుకొని జీవిస్తున్నారు.
ఈ లావా ప్రవాహానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోను చూసినా వారంతా భయంతోషాకి గురవుతున్నారు.అగ్నపర్వతం బద్దలైన తరువాత అందులోంచి వెలువడిన లావా భూమి పైకి సముద్రం లోని అలలలాగా ఉవ్వెత్తున ఎగసిపడుతూ లోతట్టు ప్రాంతాలకు ప్రవహించింది.
ఉప్పొంగి ప్రవహించే నది కన్నా భీకరంగా, అత్యంత వేగంగా, రాకసి అలలను మించిన ఎత్తులో ఎగసిపడుతూ దూసుకెళ్లింది.
అత్యంత భయానకంగా ప్రవహిస్తున్న లావాను కొందరు వ్యక్తులు దూరం నుంచి వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
లావాకు కొంత దూరంలో ఇద్దరు రెస్క్యూటీమ్ సభ్యులు నిల్చుని ఉండటం కూడా చూడొచ్చు.అయితే, ఈ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది.
ఒక భారీ నదిలా ఉన్న ఈ లావా ప్రవాహాన్ని చూసి నెటిజన్లు భయంతో వణికి పోతున్నారు.
కొంతమంది రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఇది నరకంలో నది ప్రవాహంలా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.అందులో పడితే,కనీసం బుడిద కూడా మిగలదని ఇంకొందరు అంటున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.ఇలాంటి లావా ప్రవాహం కచ్చితంగా నరకం లో ఉంటే మాత్రం చాలా మంది పాపాత్ములు నరకంలోని నరకయాతనను అనుభవిస్తారని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







